Sunday, 13 September 2026 01:43:49 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

రాజీ మార్గంలో వివాదాల పరిష్కారం

రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా

Date : 18 December 2025 08:10 PM Views : 329

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో సిపి మాట్లాడుతూ,లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయన్నారు. రాజీకి అనువైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన, కుటుంబపరమైన మరియు వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ లాంటి కేసుల్లో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా చర్చించుకుని రాజీకి రావచ్చును అన్నారు. రాజీయే రాజమార్గం" అని చిన్న చిన్న తగాదాల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దన్నారు. జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశం ద్వారా ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు మరియు పోలీస్ సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చి, రాజీ పడదగిన కేసులను గుర్తించి,ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ సాధించే ప్రయత్నాలు చేయాలని కమిషనర్ సూచించారు. తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతినపరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ గురించి ప్రజలకు సూచనలు ఇలా ఉన్నాయి అన్నారు. ఇరుపక్షాల సమ్మతితో మాత్రమే రాజీ సాధ్యమని లోక్ అదాలత్‌లో జరిగిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగాపరిగణించబడుతుం దన్నారు . ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సోషల్ వర్కర్స్ సమన్వయంతో పరిష్కారం జరుగుతుంది. ప్రజలు, పోలీస్‌లు, న్యాయస్థానాలు కలిసికట్టుగా పనిచేస్తే, చిన్న వివాదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ముందే పరిష్కరించవచ్చని సీపీ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: