ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ సంస్కృతికి నిదర్శనం తెలంగాణ తల్లి అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ఇతర జిల్లా అధికారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, మహిళను ఇంటి దేవతగా అభిమానిస్తారని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో కుటుంబంలో కొడుకు, కూతుళ్లలో ఆడబిడ్డకు ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం,అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అనేక వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని, కుటుంబానికి యజమానిగా చేసి రేషన్ కార్డులు,గృహ జ్యోతి,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, ఈ సంస్కృతిని భావితరాలకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News