ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) సీఈవో మామిడాల అశోక్ మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. మధ్యాహ్నం సమయంలో అస్వస్థతకు గురికాగా ఆయనను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 2009లో పిఎసిఎస్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రైతులకు, సభ్యులకు అందుబాటులో ఉంటూ సహకార సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
Admin
E Nivas News