Monday, 14 September 2026 12:24:29 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సిద్ధిపేట లో గెలవడంఎవరికైనా అంత సులువు కాదు..

సీఎం రేవంత్ రెడ్డి

Date : 23 March 2026 09:44 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సిద్ధిపేటలో గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ నిన్న సిద్దిపేటలో ప్రకటించారు. సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసీఆర్ కంచుకోట, కానీ గత రెండు దశాబ్దాలుగా అది తన్నీరు హరీష్ రావుకు పెట్టని కోట గా మారింది. అక్కడ రాజకీయం పార్టీల చుట్టూ కాకుండా హరీష్ రావు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆయన ఏ గుర్తు మీద నిలబడినా, లేదా స్వతంత్రంగా పోటీ చేసినాభారీమెజారిటీతో గెలుస్తారన్నది జగమెరిగిన సత్యం. ఈ స్థాయి క్రెడిబిలిటీని ఆయన కేవలం మాటలతో కాకుండా, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేపట్టడం ద్వారా సంపాదించుకున్నారు. అక్కడ ప్రతి వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ఎవరైనా గెలవాలంటే హరీష్ రావు ఆశీస్సులు ఉండాల్సిందే అనేంతగా ఆయన వ్యవస్థను నిర్మించుకున్నారు. పదవుల ఆశ చూపిన పలకని ఓటర్లు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆశ చూపడం వెనుక బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాల్లో పట్టు సాధించాలనే పట్టుదల కనిపిస్తోంది. అయితే, సిద్దిపేట ప్రజల కోణంలో చూస్తే.. హరీష్ రావు గెలిచిన ప్రతిసారీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆ నియోజకవర్గానికి ఒక మంత్రి ఉన్నట్లే లెక్క. హరీష్ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆయనకున్న ప్రభావం ముందు కొత్తగా వచ్చే అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఓటర్లను పెద్దగా ప్రభావితం చేసే అవకాశం లేదు. ఎందుకంటే, అక్కడ ఓటర్లకు కావాల్సింది పదవులు కాదు, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు నాయకత్వ లేమి కాంగ్రెస్‌కు అసలు సవాల్... సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బలమైన నాయకత్వం లేకపోవడం. హరీష్ రావు రాజకీయ చతురత వల్ల అక్కడ ఇతర పార్టీల నేతలు ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ ,బీజేపీ అక్కడ గెలవాలంటే పదవుల ప్రకటనలు చేస్తే సరిపోదు. హరీష్ రావు కంటే మిన్నగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలో సొంత క్యాడర్‌ను నిర్మించుకోగల సమర్థుడైన నాయకుడు కావాలి. కేవలం పారాచూట్ అభ్యర్థులతోనో, అప్పటికప్పుడు ఇచ్చే హామీలతోనో దశాబ్దాల అనుబంధాన్ని తెంచడం అసాధ్యం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే... రేవంత్ రెడ్డి వ్యూహం సాధ్యమవుతుందా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల వంటి సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకుని అక్కడ రాజకీయ శూన్యతను నింపాలని చూస్తున్నారు. రాజకీయంలో ఏదైనా సాధ్యమే కానీ, అది అషామాషీగా జరగదు. సిద్దిపేట వంటి చోట్ల మార్పు రావాలంటే అది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోకుండా, క్షేత్రస్థాయిలో బలం పెంచుకోకుండా చేసే ప్రకటనలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతాయి. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించాలంటే, అక్కడ హరీష్ రావు స్థాయికి దీటుగా పనిచేసే నాయకత్వాన్ని ముందుగా తయారు చేసుకోవాలన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :