ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎస్పి డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ చట్టం కింద ఉన్న కేసులకు సంబంధించిన గంజాయి, హషీష్‌ను మంగళవారం దగ్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి న్యాయస్థాన అనుమతితో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం ఒక కోటి ఇరవై ఒక లక్షల యాభై ఆరు వేల ఐదు వందలు రూపాయల విలువ గల 241 కిలోలు 956 గ్రాముల గంజాయి, 226 గ్రాముల హషీష్ ను నిబంధనల ప్రకారం దగ్ధం చేయడం జరిగిందన్నారు. మహబూబాబాద్ టౌన్, డోర్నకల్, కెసముద్రం, కురవి, గూడూరు, గర్ల, మరిపెడ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన మాదక ద్రవ్యాలను వరంగల్ కాకతీయ మెడి వేస్ట్ యూనిట్ లో ప్రత్యేక యంత్రాల ద్వారా పూర్తిగా దగ్ధంచేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News