Saturday, 12 September 2026 09:26:56 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి..! కలెక్టర్ కుమార్ దీపక్

Date : 17 August 2026 09:40 PM Views : 94

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి నీటిపారుదల శాఖ ఎస్.ఈ. విష్ణు ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు రానున్న రబీ సీజన్‌లోనూ నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని మొదటి ప్రాధాన్యతగా త్రాగునీటి అవసరాలకు వినియోగించాల్సిన పరిస్థితి ఉందని, గొల‍్లవాగు ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులలోనూ వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలిపారు. వరి పంటకు ఒక ఎకరాకు అవసరమయ్యే నీటితో సమానమయ్యే నీటిని వినియోగించి సుమారు 3 నుంచి 4 ఎకరాలలో ఆరు తడి పంటలను సాగు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులు వరి నాట్లు వేస్తే పంటకు అవసరమైన నీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పంట ఎండిపోయే ప్రమాదం, దిగుబడి తగ్గడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. నీటి కొరత కారణంగా వరి గింజ పరిమాణం తగ్గి, దిగుబడి తగ్గడంతో పాటు పంటను మార్కెట్‌లో విక్రయించడంలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, అలసందులు వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలను రైతులు ఎంచుకోవాలని, ఈ పంటలకు అవసరమైన మేరకు నీటిని అందించగలిగే అవకాశం ఉన్నందున పంటలు విజయవంతంగా సాగయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను కూడా అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు తదితర పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తోందని, మొక్కజొన్నకు బహిరంగ మార్కెట్‌లో గరిష్ట మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూన్ 1వ తేదీ నుంచే రైతులకు పంటల ఎంపికపై అవగాహన కల్పిస్తున్నామని, అయినప్పటికీ కొంతమంది రైతులు వరి సాగు చేయాలని నిర్ణయిస్తే భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు తగ్గిన నేపథ్యంలో బోర్లపై ఆధారపడే రైతులు సైతం నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, రైతులు పరిస్థితులను అంచనా వేసి నీటి లభ్యతకుఅనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత నీటి పరిస్థితులపై రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించి, పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించడంలో మీడియా సంస్థలు కూడా భాగస్వాములు కావాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నీటి లభ్యత, వర్షపాతం విషయంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం అవసరమని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలంటే వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వరి సాగు చేసి నీటి కొరతతో పంట నష్టపోయే కంటే మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, అలసందులు వంటి పంటలను సాగు చేయడం రైతులకు ప్రయోజనకరమని తెలిపారు. రైతులు నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసుకొని, వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ, సాగునీటి శాఖల అధికారుల సూచనలు పాటిస్తూ పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: