Friday, 11 September 2026 07:39:42 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ధాన్యం కొనుగోళ్లకు ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలి... జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు..

Date : 08 September 2026 09:59 PM Views : 29

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో వానాకాలం 2026-27 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు చర్యలు తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపుp కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2026-27లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గోదాములను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని, ధాన్యం కొనుగోళ్ల కొరకు సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితులలోనూ లోతట్టు ప్రాంతాలలో ఏర్పాటు చేయరాదని, ఎత్తైన ప్రాంతాలలో నీరు నిల్వఉండకుండా చదునుగా ఉన్న అనుకూల ప్రదేశాలను ఎంపిక చేసి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయఅధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలకు తరచుగా అడిగే ప్రశ్నలుపై అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు, కొనుగోలు విధానం తదితర అంశాలపై రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర అవసరమైన సదుపాయాలను ముందుగానే సమకూర్చేలా చర్యలు చేపట్టాలనిఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలనిసూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధితఅధికారులు తదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :