Sunday, 13 September 2026 01:38:14 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం...

కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన..

Date : 27 March 2026 09:29 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ కొత్తగా పెట్టే పార్టీపై ప్రకటన చేశారు. శ్రీరామనవమి వేళ ఈ కీలక ప్రటకన చేశారు. వచ్చే ఏప్రిల్ 25వ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఆరోజే పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ ఉంటుందని వెల్లడించారు. మేడ్చల్‌ మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెషన్‌లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. మార్పు కోరుకునే అభ్యుదయ వాదులు అందరూ తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడి దయతో అందరినీ కలుపుకొని పోతామని హామీ ఇచ్చారు. తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. అనంతరం ఖిల్లా రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'నేను నిజామాబాద్ కోడలిని.. తెలంగాణ బిడ్డను. నిజామాబాద్ మట్టి మంచిది. నిజామాబాద్ నుంచి తీసుకునే ఆలోచన, నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే తొలి ప్రకటన ఇక్కడినుంచి చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలి. సర్వోదయ తెలంగాణ సాధన కోసమే కొత్త పార్టీ రావాలి. తెలంగాణ సాధించి పన్నెండేళ్లు దాటింది. నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేకపోయాం. ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ప్రజలు ఆలోచించాలి. కొత్త రాజకీయ పార్టీ ఉండాలని బలంగా కోరుకుంటున్నాం' తమ అజెండా ఏంటనేది 25న ప్రకటిస్తా అని కవిత ప్రకటన చేశారు. మహిళలు, యువతకు అవకాశం.. కొత్త తరం నాయకత్వానికి, మహిళా సాధికారతకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ వర్గాల్లో ఈ కొత్త పార్టీ ప్రభావంపై ముమ్మర చర్చ సాగుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు సాంస్కృతిక మూలాలను బలంగా విశ్వసించే కవిత, ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: