Wednesday, 29 July 2026 07:23:20 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉద్యోగ ప్రకటన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి

ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఆదివాసిలతో భర్తీ చేయాలి

Date : 20 November 2025 08:30 PM Views : 245

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు ఇటీవల ప్రాచూరిత్యం అయినా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఆదివాసులకు చాలా అన్యాయం జరిగిందని, శాన్వి సర్వీసెస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనను వెంటనే రద్దు చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ను ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ గురువారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల యందు ఉద్యోగ ప్రకటన చేసినటువంటి సాన్వి సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ, ఆదివాసులకు ఏ ఒక్క పోస్టు రిజర్వేషన్ కూడా కల్పించకుండా అన్నీ కూడా గిరిజనేతరులకు కేటాయించడం తో ఆదివాసీలకు చాలా అన్యాయం జరుగుతోందని, ఆదివాసి ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్న జిల్లా జల్ జంగల్ జమీన్ కోసం ఈ గడ్డలో పోరాడిన కొమురం భీం జిల్లాలో ఆదివాసులకు ఏ ఒక్క పోస్టును కూడ కేటాయించకుండా జిల్లాలో ఉద్యోగ ప్రకటన చేయడంఆదివాసి సమాజానికే చాలా అవమానకారం అన్నారు. వెంటనే ఈ ఉద్యోగ ప్రకటనను రద్దుచేసి ఆదివాసి నిరుద్యోగులు అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయవలసిందిగా కోరుతున్నామని కోరారు . ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావ్, ఆసిఫాబాద్ మండల తుడుందేబ్బ నాయకులు కొడప జగ్గేరావు, వాంకిడి మండల తుడుందేబ్బ నాయకులు సీడం భీంరావ్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :