Saturday, 12 September 2026 09:26:48 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే సంక్షేమ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు...

Date : 22 August 2026 08:49 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రశ్నించారు. శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. అధికారులపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువులకు ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేదన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్ లో మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన ఆదిలాబాద్ జిల్లా గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి వచ్చి దివ్యాంగులకు సైకిళ్ళు అందజేసే విషయం కనీసం ఎమ్మెల్యేలకు సమాచారం లేదని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు అధికారులు కనీసం సమాచారం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. వందలాది ఏండ్లుగా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు కొత్తగా తీసుకొచ్చిన చట్టాలతో ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని, అటవీ అధికారులు హింసించడం మానుకోవాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సహకరించి ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. పిల్లలకు మెరుగైన విద్య అందించండం ముఖ్యం, చదువే భవిష్యత్తు నిర్మిస్తుంది కానీ ఇతర పనులు కాదని అన్నారు. గతంలో గిరిజనులతో కలకళలాడిన ఐటిడిఎ లు ఇప్పుడు కనీసం గెట్ వద్దకు కూడా ప్రజలు రాక దివాలగా మారాయి. వాటికి నిధులు కేటాయించి అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి పలు కీలక అంశాలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీసుకెళ్లారు. ఫారెస్టు అధికారులు అమాయక గిరిజనులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పెంచి విద్యార్థుల భవిష్యత్తుకు సహకరించాలి. ఐటిడిఎను అభివృద్ధి చేసి వాటికి అధికారం ఇవ్వాలి. ఎస్సి కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలో గల బోర్లు, మోటర్ల సమస్యలు తీర్చాలి. NH 44 జాతీయ రహదారిపై ఉండే నెరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అటవీశాఖ భూమి అని తిప్పలు పెట్టడం సరికాదు. పోడు పట్టాల రైతులకు ఇబ్బందులు పెట్టొద్దు. జంతువుల కోసం ఫ్లైవర్లు నిర్మిస్తున్నారు కానీ గిరిజనులను కనీసం కనికరించట్లేదు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :