ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించా రన్న ఆరోపణలతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ పై పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్న ఏఆర్‌ఎస్ రైస్ మిల్లు లో మూడు రబీ సీజన్లకు సంబంధిం చిన 40 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికా రులు గుర్తించారు. రెండు రోజులుగా అధికారులు ఈ రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు.ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో చూపకుండా మళ్లిం చారని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియో గం చేశారని అధికా రుల నివేదికను రూపొందించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఫిర్యాదుతో రేఖా నాయక్‌పై క్రైమ్ నంబర్ 165/2026 కింద ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
E Nivas News