ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి రెండేళ్ల సాధారణ జైలుశిక్ష, రూ.5 వేల జరిమాన విదిస్తూ మంథని అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎ. సుధారాణి తీర్పు వెలువరించ్చారు. వివరాల్లోకి వెళితే 2017 నవంబర్ లో కన్నూరి శ్రీనివాస్ కూలి పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, రామగిరి మండలం నాగేపల్లి బస్‌స్టాండ్ సమీపంలో నిందితుడు TS 25 T 0679 నంబరు గల టిప్పర్ లారీని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ శ్రీనివాస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కుడి కాలికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, అప్పటి ఎస్‌ఐ పి.శంకరయ్య దర్యాప్తు నిర్వహించారు. కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్ధ కుమార్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు, ఆధారాల సేకరణలో సమర్థవంతంగా సహకరించిన కోర్టు డ్యూటీ అధికారి ఏ. మల్లేష్,పీసీ-10, ఎస్‌ఐ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
Admin
E Nivas News