Saturday, 12 September 2026 10:22:07 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

విద్యా వారోత్సవాల్లో ఆదర్శప్రాయంగా ఉచిత పీజీ కోచింగ్, యోగా శిక్షణ..

Date : 12 May 2026 10:47 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న విద్యా వారోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉచిత పీజీ కోచింగ్ మరియు యోగా కార్యక్రమాలునిర్వహించారు. లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూరు, కాగజ్ నగర్, మహిళా జగిత్యాల కళాశాలల తెలుగు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయి ఉచిత ఎం.ఏ తెలుగు ఎంట్రన్స్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ పిల్లలమఱ్ఱి రాములు గారు ముఖ్య అతిధిగా విచ్ఛేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ చదువు వల్లనే ఉన్నత స్థాయిలో స్థిరపడుతామని కాబట్టి ఉన్నత విద్యకోసం ప్రయత్నం చేయాలనీ పేర్కొన్నారు కోచింగ్ ద్వారా ప్రామాణికమైన పుస్తకాల జ్ఞానం , నాణ్యమైన బోధన లభిస్తుందని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఇలాంటి అంతర్జాల కోచింగ్ ఉచితంగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు. కాగా మంచిర్యాల ప్రిన్సిపాల్ డా. జైకిసాన్ ఓజా లక్షెట్టిపేట కళాశాల ప్రిన్సిపాల్ డా, మహాత్మా సంతోష్ మాట్లాడుతూ ఈ కోచింగ్ కి డా. తన్నీరు సురేష్ , డా. శ్రీధర హరీష్, డా. గోలి శ్రీలత, డా. లక్మీ నరసింహం , డా. పట్వర్ధన్ సారధ్యం వహిస్తున్నారని . తెలంగాణలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న , సుదీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపకులు కోచింగ్ లో పాఠాలు బోధిస్తారని విద్యార్థులు తమ అనుమానాలు సులభంగా నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. కోచింగ్ 30 రోజుల పాటు ప్రతిరోజు అంతర్జాలం ద్వారా జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం లోని ఏ ప్రాంత విద్యార్థి అయినా సులభముగా ఈ సేవలను వినియోగించు కోవచ్చానినిర్వాహకులు తెలిపారు. సమన్వయకర్త తన్నీరు సురేష్ మాట్లాడుతూ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షతలో విద్యా వారోత్సవాల్లో భాగంగా యోగాపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కళాశాల కామర్స్ అధ్యాపకులు జాడి శంకరయ్య యోగా మాస్టర్ గా వ్యవహరిస్తూ యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు యోగ ఆసనాలు వేస్తూ ఆయా ఆసనాల వలన కలిగే ఆరోగ్య లాభాలను పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మాట్లాడుతూ యోగా వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని శరీరం ఉత్తేజాన్ని పొంది నూతన ఉత్సాహం లభిస్తుందని తెలిపారు. యోగా మన వారసత్వ సంపద అని పేర్కొన్నారు. కళాశాల అధ్యాపకులు, బోధనా బోధనేతర సిబ్బంది ప్రముఖ యోగ ఆసనాలు వేసి యోగా పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :