Friday, 11 September 2026 07:39:26 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్

Date : 10 September 2026 09:47 PM Views : 32

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్ కానీ అనమలిస్ జాబితాలో ఓటర్లకు జారీచేసిననోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నోటీసుల జారీ, విచారణ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియ నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ఓటర్లకు అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిట్టపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థులకుఅవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు . ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నసౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాగిన్ నుండి ప్రక్రియనిర్వహించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆహారం నాణ్యతను పరిశీలించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :