Sunday, 13 September 2026 01:35:07 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

Date : 15 June 2026 09:52 PM Views : 116

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాటమే తన లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆమెకు కరీంనగర్ చౌరస్తా నుండిఉత్కూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ రక్షణ సేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా పేద ప్రజల బతుకులలో ఏమాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పేద ప్రజలు ఏదో ఒక రకమైన ఇబ్బందుల్లో ఉన్నారని వారందరికీ న్యాయం జరగాలంటే తమ ప్రభుత్వం వచ్చాక వారందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తా అన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులందరికీ ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఫీజు లేకుండా విద్యను అందించే పథకాన్ని ప్రవేశపెడతానన్నారు. అలాగే ఇప్పటికీ పేద ప్రజలకు సరైన వైద్యం లేక ఎంతో మంది విగత జీవులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంతో మంది యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరికీ కూడా నా ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక రకమైన ఉపాధి కల్పిస్తానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాల నాయకుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల బతుకులు మార్చే అంతవరకు నిద్రపోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ జనార్ధన్, ని షాలేనిన్, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :