Sunday, 13 September 2026 01:41:08 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ)

Date : 29 March 2026 12:42 AM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) రాష్ట్ర అధ్యక్షుడు డా . కడారు సురేందర్ రెడ్డి సూచనతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) 2026 సంవత్సరం డైరీ, క్యాలెండర్, తెలంగాణ ప్రభుత్వ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ అసోసియేషన్ డైరీ లను శనివారం ఆవిష్కరించారు. లక్షెట్టిపేటలో కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మరియు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) జోనల్ సెక్రటరీ జాడి శంకరయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డా. తన్నీరు సురేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట అధ్యాపకులు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) సభ్యులు తిరుపతి, ప్రేమలత, నాగేశ్వర్ సంతోష్ కుమార్ చేతుల మీదుగా, మంచిర్యాలలో సంఘం బాధ్యులు డా.గోపాల కృష్ణ చేతుల మీదుగా రెండు సంఘాల డైరీ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన అధ్యాపకులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జోనల్ సెక్రటరీ జాడి శంకరయ్య, అధ్యక్షుడు సురేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను అలాగే కళాశాలల్లో చదివే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) నిశితంగా కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల సంఘాల జెఏసి అధ్యక్షుడు డా. కడారు సురేందర్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల ప్రయోజనాలు పొందడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. కళాశాలల ప్రగతి తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.విద్యార్థులు అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు ప్రభుత్వ కళాశాలలకు చెందిన విషయాలను సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధ్యాపకుల సర్వీసు సమస్యల కోసం పోరాడుతున్న టి జి సి జి టి ఏ రాష్ట్ర కార్యవర్గానికి ఈ సందర్భంగా లక్షెట్టిపేట, మంచిర్యాల కళాశాలల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :