ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఎన్ఎస్ సెక్షన్ 351, 351(3) , సెక్షన్ 196(1), సెక్షన్ 61 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారు. అలాగే షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తెలంగాణ సాధకులు, తెలంగాణ అభివృద్ధి ప్రధాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతూ, వెయ్యి డప్పుల ర్యాలీ చేయిస్తున్నాం అన్న వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు ఉన్నారు.
Admin
E Nivas News