Friday, 19 June 2026 01:05:59 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి..

ఈ నెల 18న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం..

Date : 16 June 2026 09:46 PM Views : 30

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల ​జిల్లా వ్యాప్తంగా చేపట్టబోయే వనమహోత్సవం కార్యక్రమాన్ని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యలతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మరియు మున్సిపల్ కమిషనర్లతో వన మహోత్సవం నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భావితరాలకుసమతుల్య వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈకార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదిగా ఇది ప్రారంభం కానుందని, అదే రోజున జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జిల్లాలో 41 లక్షల మొక్కలు నాటాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలనుచేరుకోవడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. నర్సరీలలోని మొక్కల వివరాలు, ప్లాంటేషన్ సైట్ల రిజిస్ట్రేషన్లను ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని, మొక్కలు నాటిన వెంటనే జియో ట్యాగింగ్ పూర్తి చేసి రోజువారీ నివేదికలను నవీకరించాలని, వీటికి అటవీ అధికారులు సాంకేతిక సహాయం అందిస్తారని స్పష్టం చేశారు.​జిల్లాలో గనుల విస్తృతి కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున, ఖాళీ ప్రదేశాలన్నింటిలో మొక్కలు నాటడం ద్వారా ఉష్ణోగ్రతలను అదుపులోకి తీసుకురావచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. రహదారులకు ఇరువైపులా పెద్ద వృక్షాలుగా ఎదిగే మొక్కలను నాటాలని, పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అటవీ భూముల తగాదాలు ఉన్న వివాదాస్పద ప్రాంతాలలో వెదురు మొక్కలను నాటాలని, ప్రజలు ఎక్కువగా సంచరించే బహిరంగ ప్రదేశాలలోపచ్చదనాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత సంబంధిత అధికారులదేనని, ప్రతి ఒక్క మొక్క ఎదిగేలా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇదే సమయంలో, మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని మరియు వాటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేకంగా ఆదేశించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: