Tuesday, 28 July 2026 11:37:46 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

అద్దె డబ్బులు చెల్లించలేదని గిరిజన కళాశాల భవనానికి తాళం వేసిన యజమాని

ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం పార్టీ నాయకులు

Date : 24 November 2025 09:53 PM Views : 190

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని లోని గిరిజన గురుకుల బాలికల కళాశాల భవనానికి 8 మాసాలుగా అద్దె డబ్బులు ఇవ్వటం లేదని యజమాని కళాశాల కార్యాలయానికి తాళం వేయడం జరిగింది. సమాచారం అందుకున్న సిపిఎం పార్టీ నాయకులు కళాశాలను సందర్శించి రెవెన్యూ సిబ్బందితో కళాశాల సిబ్బంది, యజమానితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మంథనిలో విద్యావ్యవస్థ రాను రాను నిర్వీర్యం అవుతుందన్నారు. దళితులు, గిరిజనులు బడుగు బలహీన వర్గాల హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఏడు సంవత్సరాలుగా గిరిజన కళాశాల అద్దె భవనంలో కొనసాగుతుందని, ఇంకా ఎన్ని సంవత్సరాలు గిరిజన విద్యార్థులు అద్దె భవనాలలో ఉండాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మాసాలుగా అద్దె డబ్బులు యజమానికి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు విద్యార్థులు సంవత్సర పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కళాశాల భవనానికి తాళాలు వేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. విద్యార్థినులు రోడ్డుమీదికి వస్తే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలన్నారు. అద్దె డబ్బులు చెల్లింపు విషయంలో ఆర్ సి ఓ చేతివాటం ప్రదర్శిస్తున్నాడని అనుకున్న పర్సంటేజ్ ప్రకారం మామూలు ఇవ్వకుంటే అద్దె డబ్బులు చెల్లించడం లేదని ఆర్ సి ఓ పనితీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంత్రి స్పందించి ప్రభుత్వం నుండి రావలసిన అద్దె డబ్బులు విడుదల చేయాలని గిరిజన బాలికల కళాశాల భవనంతో పాటు ఇతర హాస్టళ్లకు పక్క భవనాలు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఆయన వెంట సిపిఎం నాయకులు మంథని లింగయ్య, బాబు రవిలు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :