Tuesday, 28 July 2026 11:43:01 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రైతులకు జవాబుదారితనoగా ఉండాలి

ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

Date : 12 November 2025 10:00 PM Views : 217

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని... రైతులoటేనే కాంగ్రెస్ అని... రైతుకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో బుధవారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని అంగులూరులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జిల్లా సహకార అధికారి శ్రీమాల, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్నలతో కలిసి ప్రారంభిoచారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్ద ఎత్తున వరి ధాన్యం సేకరణ చేపడుతున్నoదున రైతుకు జవాబు దారి తనంగా ఉంటూ పనిచేయాలన్నారు. ధ్యాన్యం అమ్ముకోవడం లో రైతు పడుతున్న కష్టాన్ని గుర్తిoచి ఆనాడు తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రతీ గ్రామానికి ధ్యానం కొనుగోలు కేంద్రాలను తీసుకువచ్చామన్నారు. సన్న వడ్లను పండిoచే రైతును ప్రోత్సహిచేందుకు మద్దతు ధరతో పాటు క్విoటాల్ కు రూ.500 బోనసు చెల్లిస్తున్నామన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని, మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో మరిన్ని సౌకర్యాలు కల్పించి మరింత మెరుగు పరుస్తామన్నారు. అంతే గాకుండా రాబోయే రోజుల్లో అభివృద్ధి విషయoలో మంథనిలో మరింత మార్పు చూస్తారన్నారు. సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు కొంత ఇబ్బందికి గురయ్యారని, తడిసిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని అన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, రైతులు మంత్రి శ్రీధర్ బాబును గజ మాల వేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, ఉడుత మాధవి- పర్వతాల్ యాదవ్, దాసరి లక్ష్మి-మొండయ్య, టీజీఈఆర్సి సలహాదారు శశిభూషణ్ కాచే, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ అనిల్ కుమార్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ, మాజీ ఎంపిపి కొండ శంకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు తోట్ల తిరుపతి, పెరవేన లింగయ్య, జనగామ నర్సింగ రావు, మూల పురుషోత్తం రెడ్డి, శ్రీరాంబట్ల శ్రీనివాస్, అజీoఖాన్, లైశెట్టి రాజు, పెంటరి రాజు, పెరుగు తేజ పటేల్, కొట్టే పద్మ, ఆరెల్లి కిరణ్ గౌడ్, గుండా పాపారావు, వేల్పుల రాజు, పోలు శివ, నాంపల్లి సతీష్, చంద్రు రాజమల్లు, నక్క నాగేంద్ర, పలువురు జిల్లా, మండల అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :