ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సిఐ రమణమూర్తి తెలిపారు. లక్షేట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈసందర్బంగా సీఐ రమణమూర్తి మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో వాహన పత్రాలు ఆర్ సి తో పాటు ఇన్సూరెన్స్ పొల్యూషన్ లైసెన్స్ తప్పకుండా వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలన్నారు. వాహనాలను వేగంగా నడపకూడదని ఆటో డ్రైవర్లు పరిమితికి మించి వాహనాల్లో ప్యాసింజర్లను ఎక్కించుకోకూడదని, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్, ఎస్సై-2 రామయ్య తో పాటు పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News