ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సిర్పూర్ నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఉమ్మడి జిల్లా కో ఆడినేటర్ మంతెన సంపత్, మాయ రమేష్ లు మాట్లాడుతూ ఈ మున్సిపల్ ఎన్నికల లో ప్రతి వార్డు నుంచి పోటీలో ఉంటారని తెలిపారు. పట్టణం లో గజ్జెల లక్ష్మణ్, తౌటి అఖిల్ ,పలు వార్డు లోని యువకులను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యమంలో అల్లూరి సాయి, పోతుల ప్రవీణ్, వినీష్ రెడ్డి, చెట్టి రాజేష్, సాయి కిరణ్, కలువల చైతన్య, శేఖర్, సతీష్, బాలరాజు, గజ్జెల లక్ష్మణ్, తౌటి అఖిల్, కోటేశ్వర్ బుర్ర రాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News