Monday, 14 September 2026 06:32:18 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రిజర్వేషన్ల ప్రక్రియ పున:పరిశీలన...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 24 November 2025 08:43 PM Views : 239

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాజ్యాంగ నిబంధన, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్ వారి జనాభా సంఖ్య కంటే తక్కువగా ఉండకూడదని, అదే విధంగా మొత్తం రిజర్వేషన్స్ 50 శాతానికి మించకూడదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలు 2025 సందర్భంలో బి.సి. డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా జిల్లాలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పునః పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 306 గ్రామపంచాయతీలు, 2 వేల 680 వార్డు సభ్యుల స్థానాలకు ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న నియమావళి ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ పునః పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. భీమారం మండలంలో ఎస్.సి. 30.2 శాతం, ఎస్.టి. 20.15 శాతం (మొత్తం 50.35 శాతం) బి.సి. 0, కాసిపేట మండలంలో ఎస్.సి. 21.06 శాతం, ఎస్.టి. 29.40 శాతం (మొత్తం 50.46 శాతం), బి.సి. 0, కోటపల్లి మండలంలో ఎస్.సి. 37.77 శాతం, ఎస్.టి. 9.63 శాతం (మొత్తం 47.4 శాతం) , బి.సి. 0, మందమర్రి మండలంలో ఎస్.సి. 33.41 శాతం, ఎస్.టి. 16.39 శాతం (మొత్తం 49.8 శాతం), బి.సి. 0, నెన్నెల మండలంలో ఎస్.సి. 29.96 శాతం, ఎస్.టి. 15.20 శాతం (మొత్తం 45.16 శాతం), బి.సి. 0, ప్రకారంగా నమూనా రిజర్వేషన్లలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కేటాయించినట్లయితే నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ దాటుతుందని, ఈ కారణంగా వెనుకబడిన తరగతులకు (బి.సి.లకు) రిజర్వేషన్ల కేటాయింపు జరగడం లేదని తెలిపారు. తదుపరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :