Tuesday, 28 July 2026 11:09:05 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

'వసంత పంచమి' భారతీయ సంస్కృతికి చిహ్నం

Date : 23 January 2026 09:51 AM Views : 337

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భారతీయ సంస్కృతి పండుగలతో రుతుచక్రాలతో మమేకమైన జీవన విధానం. ఆ సంస్కృతిలో ప్రకృతి, విద్య, కళలు, ఆధ్యాత్మికత ఒకే తాటిపై నిలిచినట్లుగా కనిపిస్తాయి. అలాంటి మహత్తర సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పండుగ వసంత పంచమి. ఇది కేవలం ఒక రుతుపండుగ మాత్రమే కాదు, భారతీయ ఆలోచనా విధానానికి, సాంస్కృతిక విలువలకు ప్రతిబింబం. వసంత పంచమి మాఘమాస శుక్ల పంచమి నాడు జరుపుకుంటారు. ఈ రోజుతో వసంత రుతువు ఆరంభమవుతుంది. చలి తీవ్రత తగ్గి, ప్రకృతి మళ్లీ చైతన్యం సంతరించుకుంటుంది. చెట్లకు పూవులు పూస్తాయి, పంటలు పండుతాయి, మనుషుల మనసుల్లోనూ ఆశాభావం మొలకెత్తుతుంది. ఈ ప్రకృతి మార్పునే భారతీయులు పండుగ రూపంలో ఆహ్వానించడం వారి సంస్కృతి ప్రకృతి కేంద్రిత దృష్టికి నిదర్శనం. వసంత పంచమి ప్రత్యేకత సరస్వతి దేవి ఆరాధన. విద్య,జ్ఞానం, కళలు, సాహిత్యానికి అధిష్ఠాన దేవతగా సరస్వతిని పూజించడం భారతీయ సంస్కృతిలో విద్యకు ఇచ్చిన అత్యున్నత స్థానాన్ని తెలియజేస్తుంది. ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, పుస్తకాలు-వీణ వంటి విద్యా సామగ్రిని పూజించడం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న సంప్రదాయం. "విద్యే నిజమైన సంపద" అనే భావన వసంత పంచమిలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఈ పండుగలో పసుపు రంగుకు విశేష ప్రాధాన్యం ఉంది. పసుపు రంగు సౌభాగ్యం, శక్తి, ఉల్లాసానికి సంకేతం. పంటల పసుపు వర్ణం,వసంత రుతువు ఉల్లాసం అందరు కలసి జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. భారతీయ సంస్కృతి రంగుల ద్వారా భావాలను వ్యక్తపరచే విశిష్టతను ఇది సూచిస్తుంది. వసంత పంచమి సంగీతం, నృత్యం, కవిత్వం వంటి కళలకు ప్రోత్సాహకంగా నిలుస్తుంది. వసంతాన్ని ఆధారంగా చేసుకున్న రాగాలు, కవితలు, శృంగార భావనలు భారతీయ సాహిత్యంలో విశేష స్థానం పొందాయి. ఇది భారతీయ సంస్కృతి కేవలం ఆచారాలకు పరిమితం కాకుండా సృజనాత్మకతను ఆలింగనం చేసుకున్నదని సూచిస్తుంది. ఆధునిక కాలంలో కూడా వసంత పంచమి ప్రాముఖ్యత తగ్గలేదు. విద్యార్థులకు ఇది జ్ఞాన సాధన పట్ల నూతన ప్రేరణను అందిస్తుంది. సమాజానికి ఇది సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసే దినంగా నిలుస్తుంది. పాశ్చాత్య ప్రభావాల మధ్యనూ భారతీయ పండుగలు మన జీవన విలువలను కాపాడుతున్నాయి. వసంత పంచమి భారతీయ సంస్కృతికి ఒక జీవంత చిహ్నం. ప్రకృతి పట్ల గౌరవం, విద్య పట్ల భక్తి, కళల పట్ల ప్రేమ ఈ మూడింటి సమన్వయమే ఈ పండుగ. వసంత పంచమి ద్వారా భారతీయ సంస్కృతి తన సారాన్ని తరతరాలకు అందిస్తూ చిరకాలం నిలిచిపోతుంది. భారతీయ సంస్కృతి కేవలం ఆచారాల సమాహారం కాదు,అది పురాణ కథల ద్వారా జీవన తత్త్వాన్ని బోధించే మహా సంప్రదాయం. ఆ పురాణ పరంపరలో వసంత పంచమి ఒక పవిత్రమైన పండుగగా నిలుస్తుంది. ఈ పండుగకు రుతువుల మార్పు మాత్రమే కాదు, దేవతల లీలలు,సృష్టి రహస్యాలు, విద్యా తత్త్వం గాఢంగా అనుసంధానమై ఉన్నాయి. పురాణాల ప్రకారం ఒకప్పుడు ప్రపంచం అజ్ఞానంతో, నిశ్శబ్దంతో నిండి ఉండేది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని నిర్వహించినప్పటికీ దానికి స్ఫూర్తి, శబ్దం, జ్ఞానం లేవని భావించాడు. అప్పుడు బ్రహ్మ తన కమండలంలోని జలాన్ని భూమిపై చల్లగా, అందులో నుంచి సరస్వతి దేవి అవతరించిందని పురాణాలు చెబుతాయి. ఆమె చేతిలో వీణ, పుస్తకం, జపమాల, ఈ మూడు విద్య, సంగీతం, ధ్యానం అనే జీవన మార్గాలను సూచిస్తాయి. ఆ అవతరణ జరిగిన రోజు మాఘ శుక్ల పంచమి, అదే వసంత పంచమిగా ప్రసిద్ధి చెందింది. మరొక పురాణ కథ ప్రకారం వసంత రుతువు స్వయంగా దేవతల ఆహ్వానంతో భూమిపైకి దిగివచ్చిన రోజు ఇదే. వసంతుడు రాగాలకూ, శృంగార భావాలకూ అధిపతిగా చెప్పబడతాడు. అతని రాకతో భూమి పుష్పితమై, ప్రకృతి ఉత్సవంగా మారింది. అందుకే వసంత పంచమి సంగీతం, కవిత్వం, కళలకు అనుకూలమైన దినంగా భావించబడింది. భారతీయ సాహిత్యంలో వసంతాన్ని "జీవన రసభరిత ఋతువు"గా కొనియాడటం వెనుక ఈ పురాణ దృష్టి ఉంది. పురాణాల్లో శ్రీకృష్ణుడు వసంత రుతువును అత్యంత ప్రీతిపాత్రంగా భావించాడని భాగవత పురాణం పేర్కొంటుంది. బృందావనంలో గోపికలతో కలిసి వసంత ఉత్సవాలు నిర్వహించిన కథలు ప్రసిద్ధం. ఈ సందర్భంలో వసంత పంచమి ప్రేమ, అనురాగం, సౌందర్యానికి ప్రతీకగా మారింది. భారతీయ సంస్కృతిలో శృంగార భావం కూడా పవిత్రమైనదేనని ఈ కథలు తెలియజేస్తాయి. మరికొన్ని పురాణ కథల ప్రకారం ఈ రోజున దేవతలు విద్యను, కళలను భూమికి ప్రసాదించారని నమ్మకం. అందుకే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, విద్యారంభ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. పురాణాల ప్రభావంతోనే విద్యను దేవతా స్వరూపంగా చూడటం భారతీయ సంస్కృతిలో బలంగా స్థిరపడింది. వసంత పంచమిలో పసుపు రంగుకు ప్రాధాన్యం ఉండడం కూడా పురాణార్థమే. పసుపు రంగు సరస్వతి దేవి కాంతికి, సత్త్వ గుణానికి సూచికగా చెప్పబడుతుంది. సత్త్వం అంటే జ్ఞానం, శాంతి, శుద్ధత. ఈ గుణాన్ని జీవనంలో అలవర్చుకోవాలనే సందేశం ఈ పండుగ ఇస్తుంది. వసంత పంచమి పురాణాల కథల ద్వారా భారతీయ సంస్కృతికి మూల సారాన్ని తెలియజేస్తుంది. జ్ఞానం లేక సృష్టి నిర్జీవమని, ప్రకృతి లేక జీవితం నిరర్థకమని, కళలేక మనిషి అసంపూర్ణుడని ఈ పండుగ బోధిస్తుంది. అందుకే వసంత పంచమి భారతీయ సంస్కృతికి ఒక పౌరాణిక, ఆధ్యాత్మిక చిహ్నంగా యుగయుగాలుగా నిలుస్తోంది. --డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :