ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీలూ, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వార్డు వారీ ఓటరు జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 29, 2025 తేదీతో జారీ చేసిన నోటిఫికేషన్లో భాగంగా, 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల లో పోలింగ్ స్టేషన్ వారీ ఓటరు జాబితాల తుది ప్రచురణను జనవరి 10, 2026న చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 30 నుంచి పోలింగ్ స్టేషన్ డేటాను మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ వారీగా పునర్వ్యవస్థీకరించనున్నారు. డిసెంబర్ 31న వార్డు వారీగా డేటా సిద్ధం చేయనుండగా, జనవరి 1న డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను నోటిస్ బోర్డులపై ప్రదర్శించి అభ్యంతరాలను ఆహ్వానించనున్నారు.
Admin
E Nivas News