Wednesday, 29 July 2026 08:30:40 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్‌లు, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు

సిపి. అంబర్ కిషోర్ ఝా

Date : 03 February 2026 10:42 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారంఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులుపాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మద్యం మత్తులో వీధులు, రోడ్లపై అసభ్య పదజాలంతో మాట్లాడడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని,ఈ పరిస్థితులకు కళ్లెం వేసి ప్రజల భద్రతను పరిరక్షించేందుకు నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఫిబ్రవరి 01 నుండి మార్చి 01 వరకు అమలులో ఉంటాయని, పరిస్థితులను బట్టి ఈ కాలపరిమితిని మరింత పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. డీజే, డ్రోన్‌లపై నిషేధాజ్ఞల పొడిగింపు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జోన్‌లలో డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా మరియు శబ్ద కాలుష్యం నివారించేందుకు భారీ శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ,ప్రదర్శనల కోసం డీజే సౌండ్స్ వినియోగిస్తున్నారని, అయితే కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతితీసుకోవాలని సూచించారు. ఏ ప్రాంతంలో ఎంత స్థాయిలో మైక్ సెట్ వినియోగించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు కూడా 01-02-2026 నుండి 01-03-2026 వరకు అమలులో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు... రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో రామగుండం పోలీస్ కమిషనరేట్ యాక్ట్ 7(1), 2016, యాక్ట్ 22(1)(a) నుండి (f), 22(2)(a) & (b), 22(3), సిటీ పోలీస్ యాక్ట్ 1348 నం. IX ఫసలీ,సెక్షన్ 30, పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం 01-02-2026 ఉదయం 6:00 గంటల నుండి 01-03-2026 ఉదయం 6:00 గంటల వరకు అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కాలంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ తరహా కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనిసూచించారు. బంద్‌ల పేరిట వివిధ కారణాలు చూపుతూ సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించేందుకు ఒత్తిడి చేయడం, బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు శాఖకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: