Tuesday, 28 July 2026 07:11:57 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల..

Date : 07 April 2026 01:22 AM Views : 176

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఏటపాక, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల,పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంతో కలిసి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు . ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.భద్రాచలం పట్టణ అభివృ ద్ధికి పాలనా సౌలభ్యానికి ఈ గ్రామాలు అత్యంత కీలకమని, వీటిని తెలంగాణలో కలపడం ద్వారానే స్థానిక గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నా రు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన విలీన బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు.ఈ అంశం రెండ్రోజుల క్రితం రాజ్యసభలోనూ ప్రస్తావన కు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో తెలంగాణ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉండాలని కోరుకున్న గిరిజనులను బలవంతం గా ఏపీలో కలిపారని ఆమె మండిప డ్డారు. విభజన హామీలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ వంటి అంశాల్లో కేంద్రం తెలంగాణ కు మొండిచేయి చూపిస్తోం దని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చట్టాన్ని వాడుకుంటున్నారని.. తక్షణమే ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించా లని ఆమె డిమాండ్ చేశారు. భద్రాచలం చుట్టూ ఉన్న ఈ గ్రామాలు భౌగోళి కంగా, సామాజికంగా తెలంగాణతోనే ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :