ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన మందమర్రి, రామకృష్ణపూర్ (వయా) మంచిర్యాల షెడ్యూల్ ఆర్టీసీ బస్సును కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి శుక్రవారంప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ప్రజా రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే విధంగా ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నూతన బస్ సేవతో మందమర్రి, రామకృష్ణపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం మంచిర్యాలకు వెళ్లే ప్రయాణం మరింత సులభంగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా సౌకర్యాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. బస్సుప్రారంభంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News