ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలం లోని ఉత్కూరు గ్రామానికి చెందిన ముస్క శంకర్ ఇటీవల అనారోగ్యం తో మరణించారు. కాగా ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం జెండా వెంకటాపూర్ హెడ్ క్వార్టర్ లక్షెట్టిపేట లో మృతుడు పంట రుణం తీసుకోగా అతని పేరిట భీమా కంపెనీ కి సొసైటీ వారు ఇన్సూరెన్స్ కట్టడం తో రూ.2 లక్షల ఇన్సూరెన్స్ మంజూరు అయింది. దీంతో సోమవారం పీఏసీఎస్. జెండా వెంకటాపూర్ సంఘం చేత పీఏసీఎస్. ఛైర్మన్ తిప్పని లింగయ్య, వైస్-ఛైర్మన్ కాసు సురేష్, ఏ.డి.సి.సి.బ్యాంక్ మేనేజర్ నరేష్ , పి.ఏ.సి.ఎస్. సీఈవో విష్ణువర్ధన్ రావు చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యురాలు ముస్క లత కు రెండు లక్షల చెక్కును పంపిణీ చేశారు.
Admin
E Nivas News