ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సరళ సోనియా-కిరణ్ కు కాంగ్రెస్ పార్టీ,బీజేపీ పార్టీ,టీఆర్ఎస్ పార్టీ,కూల సంఘాల నాయకులు ఉమ్మడి అభ్యర్థి కి మద్దతుగా తెలుపు శనివారంప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సీనియర్ న్యాయవాది కారుకూరి సురేందర్ పాల్గొని మాట్లాడుతూ కొర్విచెల్మ అభివృద్ధిలో భాగంగా అన్ని పార్టీల నాయకులతో,మాట్లాడి గ్రామపంచాయతీ పరిధిలోని కూల సంఘాల నాయకులు మరియు ప్రజల కోరిక మేరకు కొర్విచెల్మ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా సరళ సోనియా-కిరణ్ కు మద్దతుగా భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు వెళ్ళి ప్రచారం చేశారు.ఈ ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ కోరిక మేరకు కొర్విచెల్మ గ్రామం పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నాయకులు,స్థానిక నాయకులతోపాటు ఇంటి ఇంటికి వెళ్ళి ప్రచారం చేశారు. ప్రచారం చేసిన వారిలో ధరణి మధుకార్,రేంక రవి,సందేల శేశీ, ప్రచారం చేసిన వారిలోకుమ్మరికుంట ప్రశాంత్, లెగిశెట్టి హరీష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దసాని వేణు,మౌళి సార్,ముత్తె వేంకటేష్,సీనియర్ నాయకులు కారుకురి బాలయ్య,తిరుపతి, ముద్దసాని తిరుపతి, మల్యాల రమేష్,అప్పని తిరుపతి,రమేష్, హనుమాన్లు, రాజయ్య,సీనియర్ సీజన్ అధ్యక్షుడు సేపురీ శంకర్ గౌడ్,గ్రామం వివిధ పార్టీల నాయకులు,రాజయ్య, లచ్చన్న,అత్తయ్య, కార్యకర్తలు,కూల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News