Monday, 14 September 2026 03:00:12 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం...

రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Date : 24 November 2025 06:33 PM Views : 340

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు డి.శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ VIATRIS సౌజన్యంతో 850 కుట్టు మిషన్లతో మంథని ప్రాంతంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో 21 ఉచిత కొట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు ఆదాయం మార్గాలు పెరగి వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలచే కుట్టు మిషన్ కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్, ఆర్టిసి అద్దె బస్సుల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు. కుట్టు మిషన్ కేంద్రం ద్వారా మహిళలకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందని మంత్రి తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రయత్నంతో మంథని లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మహిళ సోదరీమణులు వ్యాపార విస్తరణలో ఎటువంటి కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని, ప్రయాణాలు చేస్తూ వాణిజ్య వ్యాపార రంగాలలో ఎదిగేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 12 లక్షలతో స్కానింగ్ మిషన్, ఒక లక్షల 80 వేల రూపాయలతో ఏర్పాటుచేసిన ఆర్.ఓ వాటర్ ప్లాంట్, లక్ష రూపాయలతో ఏర్పాటుచేసిన ఔట్ పేషెంట్ రూమ్, 5 లక్షల రూపాయలతో నిర్మించిన పేషెంట్ వెయిటింగ్ హాల్, లక్ష రూపాయలతో కొనుగోలు చేసిన పిల్లల వార్మర్స్, 12 లక్షల రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, సీసీ కెమెరాలు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమార స్వామి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :