Sunday, 13 September 2026 01:36:45 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి...

క్రైమ్ వాహనాలు, ప్రాపర్టీ విషయంలో జాగ్రత్త వహించాలి :- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Date : 13 June 2026 08:50 PM Views : 122

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్రైమ్ వాహనాలు మరియు ప్రాపర్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.శనివారం మంచిర్యాల జోన్ పరిధిలోని దండేపల్లి పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న అనంతరం పరిసరాలను పరిశీలించిన ఆయన, రిసెప్షన్,ఐటీ విభాగం, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించారు. అలాగే ఎస్‌ఐ రాజవర్ధన్‌ను స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు,ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది సమస్యలను కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 5S విధానాన్ని అమలు చేస్తూ, పోలీస్ స్టేషన్‌ను వర్టికల్ వారీగా విభజించి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. క్రైమ్ వాహనాలు, కేసు ప్రాపర్టీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఎలాంటి పెండింగ్‌లు ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :