Saturday, 12 September 2026 01:52:15 AM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

నేరాల నియంత్రణకె పోలీసుల కార్డన్ సెర్చ్..! 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం...

సిఐ రమణమూర్తి

Date : 20 May 2026 10:54 PM Views : 245

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నేరాల నియంత్రణకి పోలీసులు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తూ జరుగుతుందని సిఐ రమణమూర్తి తెలిపారు. బుధవారం తెల్లవారుజామున మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాత బస్టాండ్, మహాలక్ష్మివాడ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, వాహన పత్రాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్డన్ సెర్చ్ అనంతరం స్థానిక ప్రజలకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి పంపవద్దని హెచ్చరించారు. వేసవి సెలవుల సందర్భంగా ఊర్లకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో వదిలివెళ్లవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని, ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట ఎస్సై సురేష్ కుమార్, దండేపల్లి ఎస్సై తైసీనోద్దీన్,జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :