ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి ) అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన రఘునాథ్ రెడ్డి తనను నియమించిన అనంతరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ తో మాట్లాడుతూ పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, రాబోయే స్థానిక ఎన్నికల వ్యూహాలపై ఇద్దరూ పరస్పరం చర్చించుకున్నారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కుటుంబాన్ని మరింతగా బలోపేతం చేయడంలో పూర్తిస్థాయి కృషి చేస్తానని రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ కలయిక సందర్భంగా కొత్త బాధ్యతలపై శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ వంశీకృష్ణ , ప్రజల సమస్యలు, యువతకు అవకాశాలు, మరియు బలమైన కాంగ్రెస్ వ్యవస్థ నిర్మాణంలో కృషి చేయాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News