ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని పలు దుకాణాలను శుక్రవారం ఎస్సై సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. మండలం తో పాటు గ్రామాల్లో చైనామంజా వాడిన, చైనా మంజాను ఎవరైనా విక్రయాలు జరిపిన పక్క కేసులునమోదుచేయడం జరుగుతుందని దుకాణదారులకు ఎస్ఐ హెచ్చరించారు. చైనా మాంజా వాడకంతో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చాలా ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారని, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి చైనా మాంజా తగిలి ఈ ప్రమాదాలు జరిగాయన్నారు. ఇవే కాకుండా చైనా మాంజాతో గాలిలో ఎగిరే పక్షులు కూడా ప్రాణాలు కోల్పోయాయని, వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించడం జరిగిందన్నారు. ఎవరు కూడా చైనా మాంజాతో గాలిపటాలు ఎగరేసిన చైనా మంజను ఎవరైనా అమ్మినట్లు తెలిసిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.
Admin
E Nivas News