ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 15 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు గురువారం వెంకట్రావుపేట లో పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ ఆదేశాల మేరకు( బ్రోస్ ఎన్జీవో) అనే స్వచ్ఛంద సంస్థ అందజేస్తున్న నిత్యావసర సరుకులతో కూడిన కిట్ లను ఎంపిక చేసిన లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ సతీష్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమం లో టీబీ సూపర్ వైజర్ సురేష్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్లు శోభ , మార్త , హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, వేణు, ఇసాక్ అహ్మద్ మరియు పలువురు ఏఎన్ఎంలు , ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News