Sunday, 13 September 2026 12:51:02 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన...

కార్నర్ మీటింగుల్లో పాల్గొన్న మంత్రి

Date : 04 February 2026 10:09 PM Views : 202

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ మరియు 15వ వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, మొత్తం మీద సుమారు 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేసినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మూడు నియోజకవర్గాల అభివృద్ధికే పరిమితమై, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతినెల సుమారు 5 వేల కోట్ల రూపాయల వరకు అప్పుల మిత్తి చెల్లిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.అలాగే, సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలాన్ని ప్రస్తావిస్తూ, ఉద్యమ సమయంలో కార్యకర్తలు సొంత డబ్బులతోనే ఉద్యమాలు నిర్వహించారని, అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో సుమారు 900 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆరోపించారు. ఆ నిధులపై పూర్తి స్థాయి ఎంక్వైరీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించినట్టు మంత్రి వివేక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం పారదర్శక పాలన, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :