Monday, 14 September 2026 04:17:31 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం..

చనాక, కోరాట పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Date : 16 January 2026 10:12 PM Views : 255

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం హతి ఘాటులో 386.46 ఓట్లతో ఏర్పాటుచేసిన పంప్ హౌస్ ను సీఎం నీటీపారుదల శాఖ మంత్రి ఉత్తర్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే నిర్మల్ జిల్లా మామడ మండలంలో సదర్ మార్ట్ పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో నీ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ నన్ను నమ్మి పేద ప్రజలంతా ఓట్లు వేసి సీఎం పదవి కట్టబెట్టారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నేను ముందుగా ఏ పని మొదలు పెట్టాలన్న ఆదిలాబాద్ జిల్లా నుండి మొదలు పెడతానని విషయం ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు త్వరలోనే ఎయిర్ బస్సును కూడా రప్పిస్తానని తెలిపారు. ఎయిర్పోర్ట్ పనులు చకచకా జరుగుతున్నాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా అభివృద్ధి చెందాలంటే ఏర్పోర్ట్ ఎంతో అవసరమని తెలిపారు అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగ యువతులు యువకులంతా బాగుపడాల్సిన ఉద్దేశంతో పదివేల ఎకరాల భూమిని కూడా చూడాలని మంత్రులను ఆదేశించారు.ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ అని కొమరం భీమ్, రాంజీ లాంటి పోరాట వీరులు కొలువుదీరిన గడ్డ అన్నారు.ఇప్పటికీ అదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపెడతానని తెలిపారు. త్వరలో చదువుల తల్లి కొలువుదిరిన బాసర లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దానికోసం పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాలని రాష్ట్ర ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదేశించారు. పాలమూరు రైతాంగానికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి కోరిక మేరకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను మంజూరు చేస్తున్నానన్నారు. దీంతో నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ దేవాలయం కోసం రూ. 300 కోట్లు వెచ్చించి ఈనెల 28న జరగబోయే జాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఇంద్రవెల్లి నాగోబా జాతరకు కూడా రూ. 22 కోట్ల రూపాయలు మంజూరు చేశానని, నాగోబా దేవాలయ ప్రాంతాన్ని పర్యటక ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు శాసన శాసనమండలి సభ్యులు వారికి ఉన్న సమస్యలను తన ముందు పెడితే వాడిని పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. అమ్మ కూడా ఆకలేస్తుంది అంటేనే అన్నం పెడుతుందని అలాగే ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో నాకేం తెలుసునని అట్టి సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చిన అయితే వాటిని పరిష్కారం చేస్తానని తెలిపారు. పేద ప్రజలకు న్యాయం చేయడమే తన మంత్రమన్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన వారు ఫార్మ్ హౌస్ లో పడుకున్నారని తెలిపారు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే అక్కచెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. అంతేకాకుండా మహిళా సంఘాల కోసం సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి వారి అభివృద్ధి పాటుపడుతున్నానని తెలిపారు. పార్టీలను పక్కనపెట్టి నాయకులంతా కలిసి మెలిసి ఉంటేనే ప్రాంతాల అభివృద్ధి జరుగుతాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గడం నగేష్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, వేడుమ బొజ్జు అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, దండేవిటల్ ఆయా శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :