ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : గిరిజన క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన తొర్రెం ఏడుకొండలు 4 వ జాతీయ (ఎం ఈ ఆర్ ఎస్ ) క్రీడా సమన్వయం-2025 కుస్తీ పోటీలు ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఒడిశా మోడల్ ట్రైబల్ సొసైటీ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 15 వ తేదీ వరకు జరిగిన కుస్తీ పోటీల్లో మొదటి స్థానంలో మన ముంజంపల్లి గ్రామానికి చెందిన తొర్రెం ఏడుకొండలు మొదటి స్థానంలో నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విజేతకి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఇంతటితో ఆగకుండామరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో బెజ్జూరు మండల మాజీ సర్పంచులు ,మాజీ ఎంపీటీసీ ,మాజీ కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కోనేరు అభిమానులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News