ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కొత్త కొమ్ముగూడెంలో బుధవారం పొలంబాట నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు విద్యుత్ సిబ్బంది కలిసి వంగిన పోల్స్ సరి చేశారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్త్ వైరింగ్, లూస్ లైన్స్ మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా ఏఈ గణేష్ మాట్లాడుతూ రైతులు పొలాలలోని మోటార్లకు కెపాసిటర్లు అమర్చు కోవాలన్నారు. దాని ద్వారా నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమన్నా రు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News