ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్య అన్నారు.మంగళవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, మండల విద్యాధికారి, మున్సిపల్ చైర్‌పర్సన్, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగినముల్కలగూడ ప్రభుత్వపాఠశాలను సందర్శించి పాఠశాల ప్రాంగణంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని పరిశీలించి, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమీప ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులనుతాత్కాలికంగా తరలించిన చర్యను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధితఅధికారులకు సూచించారు. విద్యార్థులను తరలించిన సమీప ప్రభుత్వ పాఠశాలను సందర్శించి తరగతి గదులు, విద్యార్థులకు కల్పిస్తున్నసౌకర్యాలను పరిశీలించారు. ప్రతికూల పరిస్థితులలోనూ విద్యా బోధన నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలుతీసుకోవాలని, విద్యార్థులలో ఎలాంటి ఆందోళన లేకుండా సానుకూల వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన అన్ని సౌకర్యాలను వెంటనే అందుబాటులోఉంచాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి తరగతి గదులు, గ్రంథాలయం, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు.కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా సదుపాయాలపై అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, గ్రంథాలయవినియోగం, క్రమబద్ధమైన బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మెరుగైన విద్యా ప్రమాణాలునెలకొనేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. మండల తహసీల్దార్‌తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి నిర్మాణాల పురోగతి, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, ఎదురవుతున్న సమస్యలపైలబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకుఅనుగుణంగా వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలుపారదర్శకంగా అందేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామంలోని పల్లె దవాఖానను సందర్శించి ఓ.పి. నమోదు, ఔషధ నిల్వ రిజిస్టర్లు, తల్లి-శిశు ఆరోగ్య సేవల రికార్డులు, టీకాల నమోదు వివరాలను పరిశీలించారు. దవాఖానలో మందుల లభ్యత, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను సందర్శించి తరగతి గదులు,ప్రయోగశాలలు, గ్రంథాలయం, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం,వంటశాల, భోజనశాల, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు.పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం ప్రతిరోజూ అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధితఅధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధితఅధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News