ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జీవో నెం.97 ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని, ఎస్బీటెట్ ను కాపాడాలని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు మరియు సాంకేతిక విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బీటెట్ ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు, ఈసెట్ ద్వారా http://బి .టెక్ లాటరల్ ఎంట్రీ పొందే విద్యార్థులు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.జీవో నెం.97 నుఉపసంహరించడంతో పాటు ఎస్బీటెట్ ప్రస్తుత వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని కోరారు. సాంకేతిక విద్యలో ఇప్పటికే ఉన్న విధానాలు, పరీక్షా వ్యవస్థ, సర్టిఫికెట్లు, పాలిటెక్నిక్ విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలు దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు."పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యే మెరుగైన భవిష్యత్తుకు మార్గం అన్నారు. విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం పునరాలో చించాలన్నారు. ఎస్బీటెట్ ను పరిరక్షించి, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుంది" అని భద్రబోయిన సైదులు తెలిపారు.ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని హరీష్ రావును కోరినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై అన్ని వర్గాల ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాలు స్పందించాలని పిలుపునిచ్చారు.
Admin
E Nivas News