Tuesday, 15 September 2026 06:07:26 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మహాజాతరకు 1200 మంది పోలీస్ బందోబస్తు..

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చర్యలు

Date : 14 February 2026 09:18 AM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో జరుగు ఈనెల 14, 15, 16 తేదీల్లో మహా శివరాత్రి జాతర సందర్భంగా జాతరకు వివిధ జిల్లాల నుంచి బందో బస్సుకు వచ్చిన పోలీసు అధికారులకు సిబ్బందికి శుక్రవారం వేములవాడ పట్టణ పరిధిలోని మహారాజా ఫంక్షన్ హాల్ లో విధుల నిర్వహణపై ఎస్పీ మహేష్ బి.గితే దిశా నిర్దేశం చేశారు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామి వారిని దర్శించుకునేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. దేవస్థానం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూ లైన్ పాటించేలా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం నిఘా పోలీస్ నిఘా ఉంచాలని,ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూంకు తెలియజేయాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఓపికతో సలహాలు , సూచనలు ఇస్తూ జాతరకు వచ్చే భక్తుల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని, ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో విధులు నిర్వహిస్తూ జాతర విజయవంతం చేయాలన్నారు. భక్తజన సందోహం ఉన్నచోట దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఇతరనేరాలు జరుగకుండా అరికట్టేందుకు క్రైమ్ పార్టీలు నిరంతరం నిఘాఉంచాలన్నారు.జాతరలో మహిళా రక్షణార్ధం షీ టీం బృందాలు కూడా సివిల్ డ్రెస్ లలో విధుల్లో ఉంటారనిపేర్కొన్నారు.ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపడితే అధికారులకు తెలియజేయాలన్నారు. పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున జాతరకు భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని,ట్రాఫిక్ ,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ జామ్ అవకుండా నియంత్రణ చేయాలన్నారు.జాతరకు వచ్చేవాహనాల ద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పట్టణంలో రూట్ మ్యాప్ లు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,రాత్రి వేళలో ప్రమాదాలు జరగకుండా స్టాపర్స్, కోన్స్, స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎస్పీవెంట ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్ లు,ఎస్.ఐ లు ,సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: