Tuesday, 15 September 2026 05:23:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రైతు లేకపోతే రాజ్యం లేదు....! నేటి రైతు విలువే రేపటి సమాజం

Date : 23 December 2025 12:02 PM Views : 367

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భారతదేశం వ్యవసాయాధారిత దేశం. కోట్లాది ప్రజల జీవనాధారం వ్యవసాయం. అలాంటి వ్యవసాయానికి ప్రాణం పోసే రైతు సేవలను గుర్తుచేసుకునే రోజు జాతీయ రైతు దినోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశ మాజీ ప్రధాని రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన చౌధరి చరణ్ సింగ్ గారి జయంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. రైతు దేశానికి వెన్నెముక "రైతు లేనిదే రాజ్యం లేదు" అన్న మాట కేవలం నినాదం కాదు, అది నిజం. మనం తినే ప్రతి గింజ వెనుక రైతు చెమట ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకూ మన జీవితం రైతుపై ఆధారపడి ఉంది. బియ్యం, గోధుమలు, కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ రైతు కృషి ఫలితమే. *జాతీయ రైతు దినోత్సవం ప్రాముఖ్యత* ఈ దినోత్సవం ద్వారా రైతుల కష్టాలను సమాజానికి తెలియజేయడం,వ్యవసాయ రంగ సమస్యలపై చర్చ జరగడం, యువతను వ్యవసాయానికి ఆకర్షించడం, రైతుల హక్కులు, భద్రతలపై అవగాహన పెంపొందించడం అనే ముఖ్య ఉద్దేశాలు నెరవేరుతాయి. రైతు జీవితంలోని సవాళ్లు నేటి రైతు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. వాతావరణ మార్పులు, పంటలకు సరైన ధరలు లేకపోవడం, అప్పుల భారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం, మధ్యవర్తుల దోపిడి ఈ కారణాల వల్ల రైతు ఆర్థికంగా, మానసికంగా నలిగిపోతున్నాడు. *రేపటి సమాజానికి రైతు అవసరమా* రేపటి సమాజానికి రైతు అవసరమా అంటె ఖచ్చితంగా ఉంది. ఇంకా ఎక్కువగా ఉందనె చెప్పవచ్చు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఆహారం తయారుచేసే యంత్రం ఇప్పటికీ పూర్తిగా రైతును భర్తీ చేయలేదు. ల్యాబ్ ఫుడ్ వచ్చినా, ప్రకృతి నుంచి వచ్చే ఆహారానికి ఉన్న విలువ వేరే. రైతు లేకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమైతే ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని చెప్పవచ్చు. దేశం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. ప్రకృతితో మానవ సంబంధం తెగిపోతుంది. అంటే రైతు లేకపోతే సమాజమే నిలబడదు. *రేపటి రైతు ఎలా ఉండాలి?* రేపటి సమాజానికి చదువుకున్న, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన, ఆర్గానిక్, సహజ వ్యవసాయం చేస్తూ మార్కెట్ అవగాహన ఉన్న రైతు అవసరం. రైతును "బలహీన వర్గం" గా కాకుండా "ఆహార నిర్మాత";గా గౌరవించాలి. జాతీయ రైతు దినోత్సవం ఒక వేడుక మాత్రమే కాదు. రైతుపట్ల మన బాధ్యతను గుర్తుచేసే రోజు. రైతు గతానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు, భవిష్యత్ తరాలకు దారి చూపే నాయకుడు. రేపటి సమాజానికి రైతు అవసరం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం ఒకటే రైతు లేకపోతే రేపటి సమాజమే లేదు. రైతును ఆదరించటం అంటే "మన భవిష్యత్తును కాపాడుకోవటమే". --డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: