ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నేను ఒక మండల స్థాయి అధికారిని, నా చేతిలో కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి నేనెందుకు వాడుకోవద్దు అని ఆలోచించిందేమో, అందుకే లంచం డిమాండ్ చేసింది. కానీ పాపంబాధితులు వారి కడుపు మండి తనను పట్టిస్తారని అనుకోలేదు కావచ్చు అందుకోసమే నిర్భయంగా లంచం తీసుకుంటూ చిక్కిన వైనం ఇది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి శుక్రవారంఏసీబీకి చిక్కారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్ ఇవ్వడం కోసం కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో ఆమె రూ.13వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడిస్తామన్నారు. ఏసీబీ దాడులు మండలంలో కలకలం రేపాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వేలాది రూపాయలు జీతం తీసుకుంటున్న అవి సరిపోవు అనే ఉద్దేశంతో రోజురోజుకీ లంచావతారులు పెరిగిపోతున్నారే తప్ప తగ్గడం లేదని పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Admin
E Nivas News