ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన రావికంటి సాయి (30) మృతదేహం అన్నారం బ్యారేజీ సమీపంలో దొరికింది. వివరాల్లోకి వెళ్తే సాయి సోమవారం ఉదయం గోదావరిలో స్నానం చేస్తున్న తరుణంలో నీటిలో మునిగిపోయాడు. సమాచారం తెలుసుకున్న మంథని పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సోమవారం అర్ధరాత్రి వరకు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహం లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం అన్నారం బ్యారేజి వద్ద గుర్తు తెలియని మృతదేహం తేలినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. దీంతో మృతుని బంధువులు వెళ్లి అది సాయి మృతదేహంగా గుర్తించారు.
Admin
E Nivas News