Sunday, 13 September 2026 01:36:23 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు...

Date : 06 August 2026 08:20 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఆయా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయ కార్యాలయాలతో పాటు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయంశంకర్ తన జీవితాన్ని మొత్తం తెలంగాణ కోసం ధారపోసిన త్యాగశీలి అని తెలంగాణ జాతి ఆయనకు రుణపడి ఉందని తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త తొలిదశ, మలిదశ, తుది దశ పోరాటాలకు సలహాలు ఇచ్చిన మహనీయుడు అన్నారు. తెలంగాణ ప్రజల్లో భావజాలాన్ని నింపడానికి అనేక పోరాటాలు సిద్ధాంతాలు సూచించిన మహనీయుడని ఆయన కృషి ఫలితంగానే నేడు తెలంగాణ వచ్చిందని వివరించారు. తను క్యాన్సర్ తో బాధపడుతూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో పలు కీలక సూచనలు చేసిన వక్త అన్నారు. చివరికి తాను సాధించిన తెలంగాణ కనులారా చూడకముందే తన ప్రాణాల్ని వదిలిన గొప్ప వ్యక్తి అన్నారు. ఎప్పటికీ ఎన్నటికీ జయశంకర్ సార్ ను ఎవరు కూడా మరిచిపోరని గుర్తు చేశారు. విద్యార్థులు జయశంకర్ సార్ జీవితం గురించి అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్ లు ఉపాధ్యాయ సిబ్బంది పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :