ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చెల్లంపేట శ్రీ శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణు మూర్తి ఆలయంలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సోమవారం మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట మండల ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేక భక్తులు, ఆలయ నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి,త్వరితగతిన విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు. అనంతరం విద్యుత్ శాఖ ఏం మాట్లాడుతూ త్వరలోనే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విష్ణు ఆలయంలో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో బొప్పు సతీష్,తెలంగాణ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొండా నరేష్ గో సంరక్షణ సమితి సభ్యులు ముత్తె భీమేష్,గో సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి,దండేపల్లి మండలం అంకతి శ్రీకాంత్,బందెల రవి గౌడ్,బియ్యాల దినేష్, అంకతి వెంకటేష్, ఈశ్వర్, ఎర్రం నరేష్,కే శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News