ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి గురువారంసమీక్ష నిర్వహించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి వినియోగదారునికి పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. నిల్వలను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్ మరియు గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు.
Admin
E Nivas News