Wednesday, 29 July 2026 11:10:31 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంచుతాం...

Date : 25 March 2026 07:47 AM Views : 137

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50% శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి పెరగనున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు కూడా 4,123 నుంచి 6,185కు పెరుగుతాయి.ఈ ప్రతిపాదనలో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు.. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కిఅసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు చేరే అవకాశం ఉంటుంది.ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీయే సమా వేశంలో కేంద్ర ప్రభుత్వం వామపక్ష పార్టీలకు వెల్లడించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ జరిగింది. కాంగ్రెస్‌ పార్టీతోనూ అమిత్‌ షా మాట్లాడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి అవసరమైన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అన్ని రాజకీ య పార్టీల మద్దతుతో ఈ బిల్లును ఆమోదింపజే యాలని కేంద్రం భావిస్తోంది. 2029 సాధారణ ఎన్నికల నుంచే ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. జనాభా ఆధారంగా ప్రతినిధిత్వాన్ని పెంచడం, ప్రజల సమస్య లను మరింత సమర్థవం తంగా ప్రతిబింబించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: